కొల్లూరులో గాలి వాన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులకు శుక్రవారం ప్రమాదం తప్పింది. నష్టపోయిన విద్యుత్ స్తంభాలు, ప్లెక్సీలను పరిశీలిస్తున్న సమయంలో కొల్లూరు వీఆర్వో రాంబాబుపై ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోయింది. అదృష్టవశాత్తూ స్తంభం చివరి భాగం పక్కనే ఉన్న ఇంటి గోడపై ఆనుకోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు వెంటనే ఆయనను వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.