బాపట్ల, వేమూరులో వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి స్వయం సమృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఆయన అందజేశారు. పెన్షన్లతో పాటు, స్వయం సమృద్ధి సాధించడానికి ఈ వాహనాలు తోడ్పడతాయని, ప్రభుత్వ పరంగా వీటిని ఉచితంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.