వేగంగా వెళుతున్న రెండు లారీలు ఎదురుగా ఢీకొనడంతో ఒక లారీ అదుపుతప్పి దుకాణాల మీదుకు వెళ్ళడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. కొంతమేర ఆస్థి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగక పోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటన గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండల కేంద్రమైన శావల్యాపురంలో శుక్రవారం రాత్రి జరిగింది. శావల్యాపురం అదుపుతప్పి వినుకొండ నుండి నర్సరావుపేట వైపుకు వెళుతున్న మరోలారీని ఢీకొట్టింది.