కరెంట్ స్తంభం ఎక్కి విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన రైతు మద్దిరాల పిచ్చయ్య(32) విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. వరి నారుకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన విద్యుత్ సరఫరా లేకపోవడంతో కరెంట్ స్తంభం ఎక్కగా, ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ రావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్