వినుకొండ: వైసీపీ నేత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీవి

నెల్లూరు జిల్లా మహిళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలను చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి. ఆంజనేయులు బుధవారం తీవ్రంగా ఖండించారు. వినుకొండ మండలం చీకటీగలపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళ పట్ల అసభ్యకరంగా నోరు పారేసుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్