వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఆయనకు విద్యార్థినిలు పూలతో స్వాగతం పలికారు. సమావేశంలో విద్యార్థినుల పురోగతి, విద్యా సంబంధిత అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు.