నూజండ్ల మండలంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంధ్యారాణి అనే మహిళ గాయపడింది. దర్శి నుంచి వినుకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు గురప్పనాయుడుపాలెం సమీపంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రయాణికురాలు సంధ్యారాణి బస్సు మెట్ల వద్ద నుంచి రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.