AP: బీసీలు చంద్రబాబు మోసాన్ని గమనించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీలకు టీడీపీ ఎన్ని పదవులు ఇచ్చిందో చెప్పాలని, ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. డీఎస్సీ పరీక్షకు ముందు, ఆ తర్వాత జీవోలను ఎందుకు మార్చారని నిలదీశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బొత్స విమర్శించారు.