AP: నెల్లూరు జిల్లా తోటపల్లి మండలం పేడూరు గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పర్యటించారు. వర్షాలు వస్తే మోకాలు లోతు నీటిలో తిరిగే వారమని, వైసీపీ హయాంలో సిమెంటు రోడ్డు వేసి.. తమకు శాశ్వత పరిష్కారం చూపించారంటూ గ్రామస్థులు కాకాణికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.