బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: మంత్రి కొల్లు (వీడియో)

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో భారీ పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర పర్యవేక్షణలో బీచ్‌ శుభ్రత పనులు జరిగాయి. వినాయక నిమజ్జనంతో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను మంత్రి తొలగించారు. శానిటరీ సిబ్బందితో పాటు స్వచ్ఛంద కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో విగ్రహాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయొద్దని మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. బీచ్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕