విశాఖలో గోమాంసం నిల్వ.. పవన్ సీరియస్

AP: విశాఖలో గోమాంసం నిల్వ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. గోమాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే.. పవన్ స్వయంగా పోలీస్ కమిషనర్‌కు సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో మాంసం నిల్వ చేయడం, గోమాంసం ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలించాలనుకున్నారు? వంటి అంశాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్