ఇకపై రాష్ట్రంలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది భిక్షాటనను మాఫియాగా మార్చడంతో, రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా, అది తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు.

సంబంధిత పోస్ట్