AP: సీఎం చంద్రబాబు హయాంలో హిందూ ధర్మానికి తీరని ద్రోహం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేస్తారు. సాక్స్‌లు వేసుకుని పుష్కరాలకు వస్తారు. కానీ, వైసీపీ అధినేత జగన్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ సీఎంగా ఉన్నప్పుడు శరన్నవరాత్రులకి ఇంటి దగ్గరే చెప్పులు విడిచి పంచె కట్టుకుని వచ్చి పూజలు చేశారు’ అని అన్నారు.