AP: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడా ఉంది. త్వరలో నోటీసులు జారీ చేసి శ్యామలను విచారించనున్నారు. గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో శ్యామలను పోలీసులు విచారించారు. అసలైన నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరిస్తానని శ్యామల అప్పుడు చెప్పారు. తాజాగా ఆమె పేరును ఈడీ మరోసారి చేర్చడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.