AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. సరైన పత్రాలు లేకుండా ఆవులను తరలిస్తున్న వాహనాలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వయంగా అడ్డుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో 70కి పైగా గోవులను కుక్కేసి తరలిస్తున్నారని ఆమె తెలిపారు. అనంతరం వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.