AP: తిరుమలలోని బిగ్ క్యాంటీన్లను వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హోటల్స్‌లో టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు విక్రయించాలని, సిబ్బంది డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, సాంప్రదాయ ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని సూచించారు.