జగన్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత బ్రహ్మంగారి మఠం ఎంపీపీ వీరనారాయణ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే రాజీనామా పత్రాన్ని జగన్‌కు పోస్ట్ ద్వారా పంపుతూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు జమ్మల మడుగులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్