వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతోంది. 2,611 హెక్టార్లలో అక్రమంగా ఇసుకను తవ్వినట్లు తేలింది. రీచ్‌లతో సంబంధం లేకుండా 3.91 కోట్ల టన్నుల ఇసుక తవ్వి.. తరలించినట్లు గుర్తించారు. సుమారు రూ.1,857.25 కోట్లు దోచుకున్నట్లు అంచనా వేశారు. దీనికి సంబంధించి త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.