AP: విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం రాత్రి జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్‌లు జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించారు.