AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీకి రాాజీనామా చేశారు. కాకినాడ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో సోమవారం జనసేనలో చేశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్బారావుతోపాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు, ముఖ్యనేతలు జనసేనలో చేరారు.