AP: చంద్రగిరి పట్టణంలో సోమవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. స్థానిక మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ పాకాల సతీష్ రెడ్డితో పాటు, యారాశి రవిచంద్రారెడ్డి, పాకాల జగదీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తాము టీడీపీలో చేరామని నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు.