AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తు బాధ్యతలను అదనపు ఎస్పీ వెంకట్రావుకు అప్పగించడాన్ని హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ, సిట్ అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. విచారణ చివరి దశలో ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. కాగా, తమను విచారించడంపై టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఓఎస్‌డీ అప్పన్న హైకోర్టుకు వెళ్లారు.