AP: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజనలను కలిపి తొలి విడతలో రూ.7 వేలను ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇప్పటికే అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కాగా అర్హులై ఉండి జాబితాలో పేరు లేని రైతులు ఫిర్యాదుకు చివరి తేదీ నేటితో ముగుస్తుండగా.. తాజాగా ఆ గడువును ఈ నెల 13 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇలాంటి వారు రైతు సేవా కేంద్రాల్లో లేదా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.