ఏపీలో వాలంటీర్లు ఉంటారా.. ఊడుతారా అనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఇంకా స్పష్టత రాలేదు. కానీ వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టడం సంచలనంగా మారింది. పని చేయకుండానే వాలంటీర్లు ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం ఇవ్వాలంటూ బిల్లులు పెట్టడంతో పనిచేయకుండానే జీతాలు ఇస్తున్నారని కూటమిలోని నేతలు ఆరోపిస్తున్నారు.