AP: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అర్హత లేని వారికి, టెట్ అర్హత లేకుండానే పోస్టులు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటా పేరుతో దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన కుమారుడిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్పందించని బీజేపీ, జనసేన సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ కోరుతున్నామని, నిరుద్యోగ యువత తరఫున కోర్టులోనూ పోరాటం చేస్తున్నామని తెలిపారు.