మమతా ఓటమి.. 21 నెలల తర్వాత చెప్పులు ధరించిన బీజేపీ మహిళా నేత

AP: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమిపాలయ్యేంత వరకూ చెప్పులు వేసుకోనని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి శపథం చేశారు. మమతా బెనర్జీ ఘోర ఓటమి చెందడంతో 21 నెలల తర్వాత ఆమె చెప్పులు ధరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం చేపడుతున్న అణచివేత ధోరణులు, ముఖ్యంగా ఆర్జికర్ ఆసుపత్రి ఘటన తనను తీవ్రంగా కలిచివేసాయనీ, ఆమె గద్దె దిగేదాకా చెప్పులు వేసుకోనని సంకల్పం చేసుకున్నానని ఆదిలక్ష్మి తెలిపారు. వైద్యులు హెచ్చరించినా లెక్కచేయకుండా మమత ఓటమి కోసం ఎదురు చూశానని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్