AP: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తిని గోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం జోగంపేటకు చెందిన శ్రీను.. గోపాలపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ అమ్మాయికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను పంపి డబ్బులు డిమాండ్ చేయడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు శ్రీనుని అరెస్ట్ చేశారు.