AP: భారీ వర్షాలు, వరదల కారణంగా నిలిచిపోయిన పాపికొండల బోటింగ్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదివారం పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద 103 మంది పర్యాటకులు రెండు బోట్లలో విహారయాత్రకు వెళ్లారు. కార్తీక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. సాధారణ వాతావరణం నెలకొనడంతో అధికారులు బోటింగ్‌కు అనుమతిచ్చారు.