AP: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాల పోస్టుమార్టం విషయంలో జాప్యం కొనసాగుతోంది. మొత్తం 13 మంది మృతి చెందగా.. ఇంకో 9 మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. మృతదేహాల కోసం రంపచోడవరం ఆస్పత్రి వద్ద బంధువులు పడిగాపులు కాస్తున్నారు. మృతదేహాలు త్వరగా అప్పగించాలంటూ బంధువులు కోరుతున్నారు.