పొట్టకూటి కోసం ఇరాక్ వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన పిలక బాలకృష్ణ మృతదేహం స్వగ్రామానికి చేరింది. , కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో 19 రోజుల తర్వాత ఇంటికి చేరింది. జనవరి 2న బాగ్దాద్ వెళ్లిన బాలకృష్ణ, మెదడు సంబంధిత అనారోగ్యంతో జనవరి 13న మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడంలో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. ఎమ్మెల్యే బెందాళం అశోక్ ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విదేశాంగ శాఖ, ఇరాక్ ఎంబసీతో సమన్వయం చేసి మృతదేహం భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.