ఏపీ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తుళ్లూరు మండలం రేగితోట సమీపంలో రాజధాని నిర్మాణాల కోసం గుంతలు తీస్తుండగా మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.