కల్వర్టును ఢీకొని వాగులో పడ్డ బొలేరో.. మహిళ మృతి

AP: ఏలూరు జిల్లా పోలవరం మండలం చింతూరులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్వర్టును ఢీకొన్న బొలేరో వాహనం వాగులో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్