AP: నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామంలో బొలెరో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కరిమద్దెల నుండి గని గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంకటేశ్వర్లు అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపారు. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.