అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్ కుమార్

AP: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారని నిర్ధారించుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్, వేళాంగిణినగర్‌లోని అతని ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబ సభ్యులెవరూ స్థానికంగా అందుబాటులో లేరని, ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్