వైఎస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష

AP: తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను భీమిలి వైసీపీ సమన్వయకర్త బొత్స అనూష కలిశారు. ఇటీవలే భీమిలి అసెంబ్లీ సమన్వయకర్తగా అనూషను వైసీపీ నియమించింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భీమిలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. భీమిలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనూష అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕