AP: చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత బొత్స సత్య నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేస్తున్నా, ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారని ఆయన ఆరోపించారు.