AP: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన లేదని, మాజీ సీఎం వైఎస్ జగన్, చిరంజీవిని అవమానించారని, మండలి చైర్మన్‌గా ఉన్న దళితుడిని కూడా అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాపాడాలని, చట్టసభల్లో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు.