AP: విజయనగరం జిల్లాలో ఉత్కంఠ రేపిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చేసింది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై 5,136 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు తెర్లాం మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి, చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర ముందంజలో కొనసాగుతున్నారు.