AP: వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనూష గత కొద్ది నెలలుగా తండ్రి ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, తండ్రి నిర్ణయంతో షాక్ అయిన అనూష తన మనోగతాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కాగా, విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పరిస్థితుల్లో అనూష రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది.