రాష్ట్రపతి బసపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాటు చేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అతిధి గృహంలో బస ఏర్పాటు చేయాల్సింది పోయి, ప్రైవేట్ సంస్థకు సంపదను దోచుపెట్టేందుకే ఈ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇది రాష్ట్ర పరువు తీసే నిర్ణయమని, అవసరమైతే ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతులతో మాట్లాడేందుకు వెళ్తే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడి, తమపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం ఆటవిక రాజ్యానికి నిదర్శనమని అన్నారు.

సంబంధిత పోస్ట్