AP: విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్‌ను తలుచుకుని ఆయన కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా, మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ గురించి దిగజారి మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.