AP: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు మహిళలంటే గౌరవం లేదని, ఆయన వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు చైర్మన్ వైఫల్యమేనని, లడ్డూ వివాదంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు అనవసరమని, ఇందాపూర్ డెయిరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అధిక ధరలకు కట్టబెట్టడంపై అనుమానాలున్నాయని రోజా విమర్శించారు.