AP: లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల మార్కులు, ఇంటర్మీడియట్‌లో ఒక సబ్జెక్టులో ఫెయిలై అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 25% వెయిటేజీ ఇవ్వడం వంటి కారణాలతో ఫలితాల విడుదలను గురువారానికి వాయిదా వేశారు.