AP: కాకినాడ జిల్లాలో కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి, సారవ మండలాల్లోని గ్రామాల్లో వర్షం పడింది. దీంతో రబీలో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా మిర్చి, వరి, అరటి రైతులు నష్టపోతున్నారు.