వైసీపీ యువనేత దారుణ హత్య!

AP: అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర వద్ద బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. జి.కొట్టాల గ్రామానికి చెందిన వైసీపీ యువనేత సతీష్ రెడ్డి (34) పామిడిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. దుండగులు ఆయన గొంతు కోసి చంపినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తే గొంతుకోసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్