AP: గుంటూరులో వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల అండతో టీడీపీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తమ ఇంటిపై దాడి చేసి, తమపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారని అంబటి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కాదని, అది దగా డీఎస్సీ అని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు.