AP: ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున 50 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి నంద్యాలకు వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. యర్రగంట్ల ఉషోదయ ప్రైవేట్ పాఠశాల వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.