వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని రఘురామ అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోయిన అతనిపై అనర్హత వేటుతో పాటు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని అన్నారు. జగన్‌కు అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను చెప్పుకోవాలని సూచించారు.