AP ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా “ఉచిత విద్యుత్ పథకం” ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు, ప్రతి పవర్‌లూమ్ యూనిట్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 93,000కు పైగా చేనేత కుటుంబాలు, 10,534 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందనున్నాయి.