జనసేనలోకి బైరా దిలీప్ చక్రవర్తి

ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన దిలీప్ చక్రవర్తి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్న ఆయన, మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా జనసేన పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన "లైఫ్ హక్స్" పుస్తకాన్ని పవన్ కల్యాణ్‌కు అందజేశారు. అనంతరం ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕